ఎల్‌ఐసీ బ్రాంచ్‌ ఆవరణలో మేడే వేడుకలు

0చూసినవారు
ఎల్‌ఐసీ బ్రాంచ్‌ ఆవరణలో మేడే వేడుకలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా శుక్రవారం స్థానిక ఎల్‌ఐసీ బ్రాంచ్‌ ఆవరణలో ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు వి. విజయ్‌ శంకర్, కార్యదర్శి బి. కన్నయ్య జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించిన హక్కులను ఎవరూ హరించరాదన్నారు. కార్మిక చట్టాలపై ప్రతికూల విధానాలను వ్యతిరేకిస్తూ అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అమర్ సింగ్, మల్లం రమేష్, వి. మల్లేశ్, లత, సువర్ణరాణి, ప్రసాద్‌రావు, రవికుమార్, నరేష్, రమేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్