కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మేడే దినోత్సవాన్ని ఉపాధి హామీ కూలీలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మందులు నాగయ్య, వార్డు సభ్యురాలు ఓరుగంటి రమాదేవి, మాజీ ప్యాక్స్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అధికారులు బూతం బిక్షం, ఖమ్మం ఉపేందర్‌తో పాటు పలువురు హాజరయ్యారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయ పక్షాల నాయకులు కూడా పాల్గొని కూలీలకు సంఘీభావం తెలిపారు.