ఉపాధి హామీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

707చూసినవారు
ఉపాధి హామీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు
కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాలకి సురేష్, ఉపాధి హామీ కార్మిక సంఘం నాయకురాలు వెలది పద్మావతి పాల్గొన్నారు. మేడే సందర్భంగా కార్మికులకు మిఠాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్, ఎస్కె హమీద్, జరీనా, జయకృష్ణ, త్రివేణి, విజయమ్మ, సరిత, సంధ్య, సుధాకర్, శ్రీలక్ష్మి, సైదమ్మ తదితర ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.