మిమిక్రీ కళాకారుడు, నటుడు శివా రెడ్డి కి కోదాడ లో ఘన స్వాగతం

6చూసినవారు
మిమిక్రీ కళాకారుడు, నటుడు శివా రెడ్డి కి కోదాడ లో ఘన స్వాగతం
కోదాడలో విజయభవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, సినీ నటుడు శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేశారు. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికాబద్ధమైన చదువు, క్రమశిక్షణ, పట్టుదల అవసరమని శివారెడ్డి విద్యార్థులకు సూచించారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చారు గుండ్ల రాజశేఖర్, ప్రవీణ్, డాక్టర్ నీల సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్