కోదాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతగా మంజూరైన 210 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. అర్హులైన పేద కుటుంబాలకే సొంత ఇంటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఆమె తెలిపారు. మొత్తం 210 ఇళ్లలో 198 సాధారణ కేటగిరీ, 12 ప్రత్యేక కేటగిరీ ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.