
ఘనంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలు (వీడియో)
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తన 45వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ దిగ్గజాలు, చిత్రనిర్మాతలు, రాజకీయ ప్రముఖులు, 50 మంది మేధావులు, 11,000 మంది పిల్లలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. గురుదేవ్ రవిశంకర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'వైట్' సినిమా గురించి, ఆయన బోధనల ప్రభావం గురించి పలువురు ప్రముఖులు తమ అనుభవాలను పంచుకున్నారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గురుదేవ్ కృషిని ప్రశంసించారు.




