సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బుధవారం కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో రాణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రయాణికుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.