మోతె మండలంలోని పలు గ్రామాల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను తాసిల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఆంజనేయులు, తహసిల్దార్ వెంకన్న, కార్యదర్శులు సంపత్, రేణుక, మౌనిక పాల్గొన్నారు.