హైదరాబాద్ జేఎన్ టీయూలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న మోతె మండలం పెద్దరాజు తండాకు చెందిన భానోతు రవీందర్ నాయక్ (21) హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.