బేతవోలు, పోలేనిగూడెం గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ‘గో టు విలేజ్’

618చూసినవారు
బేతవోలు, పోలేనిగూడెం గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ‘గో టు విలేజ్’
చిలుకూరు మండలంలోని బేతవోలు, పోలేనిగూడెం గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ‘గో టు విలేజ్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా లభించిన అవకాశాలను మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. జూలై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని, ప్రతి గ్రామంలో సంఘటితంగా పనిచేస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్