కత్రం లీగ్ కబడ్డీ పోటీల్లో విన్నర్ గా మునగాల హాంటర్స్ టీమ్

0చూసినవారు
కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరిగిన కబడ్డీ లీగ్ పోటీల్లో మునగాల హాంటర్స్ టీం 75 వేల రూపాయల ప్రథమ బహుమతిని గెలుచుకుంది. అనంత గిరి హక్స్ ద్వితీయ బహుమతి (60 వేలు), కోదాడ లైన్స్ తృతీయ బహుమతి (40 వేలు), మోతె బుల్స్ చతుర్ద బహుమతిని కైవసం చేసుకున్నాయి. విజేతలకు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహా రావు, ఉపాధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు, కౌన్సిలర్లు, కత్రం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, కోచ్ లు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :