జనాభా ప్రాతిపదికన బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని మునగాల మండల ప్రముఖ న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్ అన్నారు. శనివారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఈమెయిల్ ద్వారా వినతిపత్రం అందించారు. దేశవ్యాప్తంగా 60 శాతానికి పైగా బీసీలు ఉన్నారని, 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వని పక్షంలో వెంటనే బీసీ జనాభా లెక్కించాలని ఆయన కోరారు.