మున్సిపల్ పార్కును పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

0చూసినవారు
మున్సిపల్ పార్కును పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, ఉత్తం పద్మావతి నగర్‌లోని మున్సిపల్ పార్కును సందర్శించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. పిల్లల ఆట వస్తువులను పరిశీలిస్తూ చిన్నారులతో ముచ్చటించి, వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కొంత సమయం గడిపిన ఆమె, పార్కులోని వాకింగ్ ట్రాక్, మ్యూజికల్ నైట్ వంటి సదుపాయాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్