మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం తో పని చేయాలి

2చూసినవారు
మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం తో పని చేయాలి
కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులను కైవసం చేసుకుని, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని పట్టణ నాయకులకు మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, సీహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, వంగ వీటి రామారావు, సామినేని ప్రమీల, మల్లీశ్వరి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :