
ముగ్గురితో భార్య అక్రమ సంబంధం.. భర్త ఆత్మహత్య
ఏపీ లోని నంద్యాలకు చెందిన రేణుక, మార్కాపురానికి చెందిన సీతారాం దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సీతారాం హైదరాబాద్ లోని బాచుపల్లిలో స్థిరపడ్డారు. భార్య రేణుక ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుని, రమణారెడ్డి అనే వ్యక్తితో ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీయించుకుంది. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో, భార్య నిజస్వరూపం తెలుసుకున్న సీతారాం ఫిబ్రవరిలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు రేణుకతో పాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. నెలకు రూ.2 లక్షలు సంపాదించే సీతారాం భార్య నమ్మకద్రోహం వల్ల ప్రాణాలు కోల్పోయాడని, పిల్లలు అనాథలయ్యారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.




