మతసామరస్యాన్ని చాటిన ముస్లిం సోదరులు

1224చూసినవారు
మతసామరస్యాన్ని చాటిన ముస్లిం సోదరులు
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బుధవారం  జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలలో ముస్లిం సోదరులు కులమతాలకు అతీతంగా తమ సోదరభావాన్ని చాటుకున్నారు. నిమజ్జనంలో పాల్గొన్న భక్తులకు రోజంతా తాగునీటిని అందజేసి, కోదాడలో ఎల్లప్పుడూ హిందూ ముస్లింలు కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటారని తెలియజేశారు. ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

సంబంధిత పోస్ట్