వర్షాల కోసం ఈద్గాలో ముస్లింల సామూహిక ప్రార్థనలు

1చూసినవారు
వర్షాల కోసం ఈద్గాలో ముస్లింల సామూహిక ప్రార్థనలు
కోదాడ పట్టణంలోని సాలార్జంగ్‌పేట ఈద్గా వద్ద ముస్లింలు వర్షాల కోసం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోవాలని వారు దువా చేశారు. రాబోయే రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి సాగు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళికి ఉపశమనం కలగాలని ప్రార్థించారు. అల్లాహ్ కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్