నడిగూడెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ అహ్మద్ తల్లి ఇటీవల మృతి చెందారు. కాగా వారి కుటుంబ సభ్యులను కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.