నడిగూడెం మండల ఎస్సై అజయ్ కుమార్, బుధవారం నడిగూడెం మండలం బృందావనపురం నుండి నడిగూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో, బొలెరో యూనియన్ డ్రైవర్లు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమానికి పూనుకోవడం అభినందనీయమని, నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా సమాజంలో గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా యూనియన్ల బాధ్యులు పాల్గొన్నారు.