నడిగూడెం శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి అనుసంధానంగా నిర్మిస్తున్న కళ్యాణ మండప నిర్మాణానికి స్వర్గీయ శంభుని సత్యనారాయణ శర్మ జ్ఞాపకార్థం ఆయన భార్య దుర్గాబాయి, ఆమె కుమారులు రూ. 30,116 విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెంకటరత్నం, కె వి ఎస్ ఎన్ గుప్తా, వందనపు సూర్యప్రకాశరావు, మోహన్ రావు, చంద్రమోహన్, దయాకర్, అప్పారావు పాల్గొన్నారు.