నడిగూడెం సాయిబాబా ఆలయంలో బుధవారం ఆలయ 24వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. స్థానికులైన గజ్జి శంకర్, సంధ్యారాణి దంపతులు 20వేల రూపాయల విలువైన వెండి మారేడు దళము హారాన్ని విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.