నడి గూడెం: యువకుల శ్రమ దానం ఆదర్శనీయం

12చూసినవారు
నడి గూడెం: యువకుల శ్రమ దానం ఆదర్శనీయం
ఇటివల కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా నడిగూడెం మండల కేంద్రంలోని రోడ్లు పెద్ద ఎత్తున గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం గుంతలను చూస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో, స్థానిక ముస్లిం యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతలను మట్టితో పూడ్చి, శ్రమదానం చేశారు. పలు మండలాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అధికారులు రోడ్ల మరమ్మతులకు ఆదేశాలు జారీ చేయకపోవడం విచారకరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్