కోదాడలో
బీజేపీ సూర్యాపేట జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన కట్టుకోజు నాగేంద్ర చారికి పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
బీజేపీ జిల్లా నాయకులు ఓరుగంటి పురుషోత్తం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాగేంద్ర చారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, అంబటి సుధాకర్ రెడ్డి, రణబోతు వెంకటరెడ్డి, కొండ్లె రవి, వంగాల పిచ్చయ్య, మీ సేవ ప్రవీణ్, నల్ల నాగేశ్వరరావు, ఉడుతా విశ్వనాథం, సంపేట భాగ్యరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.