పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కోదాడ మండలం నల్లబండగూడెం హైస్కూల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పి సంతోష్ 572/600 మార్కులతో మండల టాపర్‌గా నిలిచాడు. కే ఉష (565/600), యం సర్వజ్ఞ (554/600), కీర్తి రెడ్డి (543/600) కూడా మండలంలో అగ్రస్థానంలో నిలిచారు. పాఠశాల హెచ్‌ఎం వక్కవంతుల వసంత మాట్లాడుతూ, 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని, మొత్తం 35 మందిలో 34 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మండల స్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.