సూర్యాపేట జిల్లా ఎంఈఎఫ్ ప్రధాన కార్యదర్శిగా నందిపాటి రవిని నియమించారు. కోదాడలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న రవి నియామకాన్ని ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ప్రసాద్ మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్ మాదిగ ప్రకటించారు. ఈ సందర్భంగా కోదాడ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. కత్తి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వల్లంపట్ల కృష్ణ మాదిగలు పాల్గొని రవిని సన్మానించారు.