
జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి
జర్మనీలో తెలంగాణకు చెందిన తోకల హృతిక్ రెడ్డి అనే విద్యార్థి అగ్నిప్రమాదంలో మృతిచెందాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి, తాను ఉంటున్న భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




