స్థానికులకే టికెట్: కాంగ్రెస్ తీరుపై వార్డు ప్రజల నిరసన

0చూసినవారు
స్థానికులకే టికెట్: కాంగ్రెస్ తీరుపై వార్డు ప్రజల నిరసన
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం 14వ వార్డులో స్థానికులకే అవకాశం ఇవ్వాలని, బయటి అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వార్డు ప్రజలు ఖండించారు. శనివారం రామినేని శ్రీనివాసరావు నివాసంలో జరిగిన సమావేశంలో అందరూ ఏకాభిప్రాయంతో రామినేని శ్రీనును తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, పార్టీ అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా “లోకల్ ముద్దు – నాన్ లోకల్ వద్దు” అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్