ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్‌గా ఓరుగంటి

1చూసినవారు
ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్‌గా ఓరుగంటి
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్‌గా సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీనియర్ నాయకుడు ఓరుగంటి ప్రభాకర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వాసవి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ తనపై నమ్మకంతో బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్