కోదాడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నాని నరేష్ లు రైతుల ధాన్యం ఎగుమతులు, దిగుమతులు జాప్యం వెంటనే జరిగేటట్టు చూడాలని కోరారు. గురువారం కోదాడ మండల తహసిల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ కిరణ్ ను సన్మానించి, పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రభాకర్ రావు, సీఈఓ మందా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.