కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం కోదాడలోని తమ్మరలో కోదాడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రామారావు, మాజీ కౌన్సిలర్ సామినేని నరేష్ కూడా పాల్గొన్నారు.