
అరేబియా సముద్రంలో ONGC గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం
దేశంలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ అరేబియా సముద్రంలోని తన ప్రతిష్టాత్మక DUDP నుంచి వాణిజ్యపరంగా గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించింది. సుమారు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్లు) వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, ముంబైకి వాయువ్యంగా 180 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఓఎన్జీసీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు డ్రిల్-డెక్ అనే వినూత్న నిర్మాణ పద్ధతులను ఉపయోగించి కేవలం రెండు ఏళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.




