తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు నడిగూడెం మండల కేంద్రంలో ఆదివారం నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్, మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.