పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా లు పూర్తి చేయాలి

0చూసినవారు
పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా లు పూర్తి చేయాలి
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి ఫిర్యాదులు, భూ భారతి దరఖాస్తులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో తహసీల్దార్లు, ఆర్డీవోలతో నిర్వహించిన వెబ్‌ఎక్స్ సమావేశంలో ఆయన ఈ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించి పూర్తి నివేదికను జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్