ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి

7చూసినవారు
ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి
కోదాడ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో సోమవారం పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కాలువ పూడికతీత పనులు మున్సిపల్ చైర్మన్ కుసుమ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కందుల కోటేశ్వరరావు పాల్గొన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్