కోదాడలో పెట్రోల్, డీజిల్ కొరత: బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు

1226చూసినవారు
కోదాడలో పెట్రోల్, డీజిల్ కొరత: బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు
గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఇంధన కొరత తీవ్రమైంది. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద "నో స్టాక్" బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర వాహనాల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై "నో పెట్రోల్.. నో రైడ్!" అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంతరాయం ఎప్పుడు తొలగిపోతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్