
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
AP: అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.




