కోదాడ లో నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ తో పోలీసుల తనిఖీలు

1చూసినవారు
కోదాడ లో నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ తో పోలీసుల తనిఖీలు
జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలో టౌన్ పోలీసులు నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లు, మద్యం దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు సీఐ శివశంకర్ తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, డ్రగ్స్ వినియోగం లేదా సరఫరాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్