బక్రీద్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎస్‌ఐ సుదీర్, ట్రాఫిక్ ఎస్‌ఐ అంజిరెడ్డి నేతృత్వంలో నాలుగు పోలీసు బృందాలు ఖమ్మం అడ్డరోడ్డు, హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద నాకాబంది చేపట్టాయి. పట్టణంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానితుల వివరాలను నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణా, గంజాయి, పేలుడు పదార్థాలు, మారణాయుధాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలించవద్దని వాహనదారులకు సూచించారు. ప్రజల భద్రతే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.