బక్రీద్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలోని సాలార్జంగ్‌పేట ఈద్గా వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీ సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్న నేపథ్యంలో డాగ్ స్క్వాడ్‌తో ఈద్గా ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మెటల్ డిటెక్టర్ల సహాయంతో ప్రార్థనా మైదానాన్ని పూర్తిగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.