
రెండింతలు పెరిగిన చైనా ఉక్కు దిగుమతులు
భారత్కు చైనా స్టీల్ దిగుమతులు ఆందోళనకర స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్లో చైనా నుంచి ఉక్కు దిగుమతులు రెండింతలు పెరిగి, గత రెండేళ్లలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల భారతీయ స్టీల్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా నుంచి హాట్-రోల్డ్ కాయిల్స్, స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులకు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు ఉండటంతో, తక్కువ ధరకు లభిస్తున్న చైనా ఉత్పత్తులు దేశీయ పరిశ్రమకు సవాలుగా మారాయని జిందాల్ స్టెయిన్లెస్ సీఈఓ తరుణ్ ఖుల్బే తెలిపారు.




