కోదాడ పట్టణంలోని అవుట్, ఇండోర్ సబ్ స్టేషన్ల ఫీడర్ల తీగలకు అడ్డుపడుతున్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు పట్టణంలోని గణేష్ నగర్, సాయి నగర్, విజయవాడ రోడ్, శ్రీరంగాపురం, అశోక్ నగర్, అలవాలపురం, శ్రీనివాస నగర్, ఆజాద్ నగర్, గాంధీనగర్, బంజారా కాలనీ, టీచర్స్ కాలనీ, శ్రీమన్నారాయణ కాలనీ, హుజూర్నగర్ రోడ్డు ప్రాంతం, ఉత్తమ్ పద్మావతి నగర్, బాబు నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నరసింహ నాయక్ తెలిపారు. వినియోగదారులు ఈ అంతరానికి సహకరించాలని ఆయన కోరారు.