ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ

809చూసినవారు
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు కానుందని, అందరికీ ప్రయోజనం చేకూరేలా హెల్త్ కార్డులు అందుబాటులోకి వస్తాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కోదాడలో జరిగిన సామూహిక జన్మదిన వేడుకలు, జిల్లాస్థాయి క్రీడా–సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం లో మాట్లాడారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సీపీఎస్ తదితర ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, త్వరలో అమలు చేస్తుందని చెప్పారు. అనంతరం జూన్ నెల జన్మదిన వేడుకలు నిర్వహించి విజేతలను సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్