మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జైలు... జరిమాన

1చూసినవారు
మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జైలు... జరిమాన
కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రంగా థియేటర్ చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, ఒకరికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ. 2000 జరిమానా, మిగిలిన ఇద్దరికి రూ. 4000 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి చలాన్లు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్