వృత్తి ఉపాధ్యాయ.. ప్రవృత్తి సామాజిక సేవ

1చూసినవారు
వృత్తి ఉపాధ్యాయ.. ప్రవృత్తి సామాజిక సేవ
కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తూ 45 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో 256 మంది సభ్యులతో వాట్సాప్ రక్తదాతల గ్రూప్‌ను ఏర్పాటు చేసి, 2019 నుంచి ఇప్పటివరకు కోదాడ పరిసర ప్రాంతాల్లో అనారోగ్యం, శస్త్రచికిత్సల కోసం అవసరమైన 1,215 మందికి రక్తం అందించడంలో కీలక పాత్ర పోషించారు. యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తూ, తాను కూడా ఓ పాజిటివ్ రక్తం అవసరమైన ప్రతిసారి దానం చేస్తున్నారు. కోఆర్డినేటర్లు పత్తి నరేందర్, వెంపటి వెంకటరమణ సహకారంతో రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్