ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ముమ్మరంగా వార్డు సభలు

1చూసినవారు
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ముమ్మరంగా వార్డు సభలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 31, 20, 33, 18 వార్డులలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ అన్ని వార్డులలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను మున్సిపల్ కౌన్సిలర్లు సంబంధిత శాఖల అధికారులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టామన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో నేరుగా మమేకమవుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్