గాంధీనగర్ 34వ వార్డులో విజయవంతంగా పల్స్ పోలియో

0చూసినవారు
గాంధీనగర్ 34వ వార్డులో విజయవంతంగా పల్స్ పోలియో
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ 34వ వార్డులో స్థానిక ప్రాథమిక పాఠశాలలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ముఖ్య అతిథిగా పాల్గొని, ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఏఎన్‌ఎం మాతంగి జయమ్మ, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు.
Job Suitcase

Jobs near you