విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి.. ఎమ్మెల్యే

0చూసినవారు
విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి.. ఎమ్మెల్యే
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో చిన్నారి విద్యాపీఠం స్కూల్ ను ప్రారంభించి ఆమె మాట్లాడారు. పాఠశాలను వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, గ్రంథాలయ చైర్మన్ రామారావు, టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :