కోదాడ లో రామ చిలుక రెక్కకు శస్త్ర చికిత్స........

1చూసినవారు
జగ్గయ్యపేటకు చెందిన ఒక కుటుంబం పెంచుకుంటున్న రామ చిలుక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు తగిలి తీవ్రంగా గాయపడింది. రెక్క ఎముక విరగడంతో, కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య 22 నంబర్ సూదిని రాడ్‌లా ఉపయోగించి శస్త్రచికిత్స ద్వారా విరిగిన ఎముకను అతికించారు. చికిత్స అనంతరం చిలుక రెక్క కదలడంతో యజమాని ఆనందం వ్యక్తం చేశారు. పక్షిపై ప్రేమతో యజమాని వైద్యం పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఆందోళన చెందడం అక్కడున్న వారిని కలచివేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you