రహదారి కి మరమ్మత్తులు చేపట్టాలని వినతి పత్రం

615చూసినవారు
రహదారి కి మరమ్మత్తులు చేపట్టాలని వినతి పత్రం
కోదాడ మున్సిపాలిటీలోని 21వ వార్డు పరిధిలో ఎల్‌ఐసీ రోడ్ నుంచి కట్టకమ్మగూడెం వెళ్లే రహదారి గుంతలతో అధ్వాన్నంగా మారిందని, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని గంగిరెడ్డి రాకేష్ రెడ్డి బృందం సోమవారం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించింది. రహదారిపై గుంతల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని, దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారని, క్రమం తప్పకుండా శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కోరారు. స్థానిక కౌన్సిలర్ కట్టెబోయిన శ్రీనివాస్‌కు కూడా సమస్యలను వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్