విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలీ

2చూసినవారు
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలీ
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వారికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య కోరారు. శనివారం కోదాడలోని సంఘ భవనంలో విశ్రాంత ఉద్యోగుల జనవరి నెల పుట్టినరోజు వేడుకలు సామూహికంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అసోసియేట్ అధ్యక్షులు జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి వీరబాబు, విద్యాసాగర్ రావు, హాజీ నాయక్, బాలేమియా, ఎస్ దాని పాల్గొన్నారు.